స్వామి నిత్యానంద సంచలన ప్రకటన.. గోవులతో సంస్కృతం మాట్లాడిస్తారట!

  • ఆవులతో సంస్కృతం, తమిళం మాట్లాడిస్తా
  • పులులు, కోతుల కోసం ప్రత్యేక స్వరపేటిక
  • ఏడాదిలోపే నిరూపిస్తా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఆవులతో సంస్కృతం, తమిళ భాషలు మాట్లాడిస్తానని పేర్కొన్నారు. ఏడాది లోపే ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తానని శపథం చేశారు. తానీ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, కోతులు, పులులు, సింహాల కోసం కూడా భాషా సామర్థ్యమున్న స్వరపేటికను అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. దానిని పరీక్షించిన తర్వాతే తానీ ప్రకటన చేస్తున్నానని, ఏడాదిలోపు గోవులతో సంస్కృతంలో మాట్లాడిస్తానని పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
NItyananda
Tamil Nadu
Cows
Sanskrit
Tamil
Tigers
Monkey

More Telugu News